సముద్ర మట్టానికి 2755 మీటర్ల ఎత్తులో ఉన్న దైనకుండ్ శిఖరం, డల్హౌసీ లోనే ఎత్తైన పర్వతం. పట్టణం నుండి 10 కి.మీ.ల దూరంలో ఉన్న ఈ ప్రదేశం, దాని అందమైన ప్రకృతి సౌందర్యం కొరకు ప్రసిద్ధి చెందింది. ఈ శిఖరం పర్యాటకులకు మొత్తం లోయ యొక్క 360 డిగ్రీల వీక్షణ అందిస్తుంది.పర్వతం గుండా వీచే గాలి సున్నితంగా చేసే సుశ్రావ్యమైన ధ్వని వలన ఈ శిఖరాన్ని "పాడే కొండ" అని కూడా అంటారు. ఈ శిఖరం వైమానిక దళ స్థావరం, దీనికి ఎడమ వైపు ఈ ప్రాంతంలోనే ప్రముఖ పర్యాటక ప్రదేశాలలో ఒకటిగా భావించబడే ఫోలాని దేవి ఆలయం ఉంది. ఆలయం గురించిన ఒక ఆసక్తికరమైన విశేషం ఏమిటంటే, ఇక్కడ కేవలం ఒక త్రిశూలం మాత్రమే కనిపిస్తుంది. సాహస ప్రేమికులు, నదీతలాలకు అడ్డంగా ప్రవహిస్తున్ననదులు అందించే అద్భుత దృశ్యాలను చూస్తూ, లోయ లో ట్రెక్ చేయవచ్చు. కాలతోప్ వన్యప్రాణుల అభయారణ్యం మరియు గాంధీ చౌక్, ఇక్కడికి సమీపంలోని పర్యాటక ఆకర్షణలు.



Click it and Unblock the Notifications