దండేలి సందర్శకులు దండేలి వన్యజంతువుల సంరక్షణాలయం తప్పక చూడాలి. ఇది ప్రధాన ఆకర్షణ. అడవిలో ఎంపిక చేయబడిన కొన్ని ప్రాంతాలను దండేలి వైల్డ్ లైఫ్ శాంక్చువరీగా 1956 మే 10వ తేదీన ప్రకటించారు. దీనిని దండేలి అన్షి టైగర్ రిజర్వ్ గా 2006 లో ప్రకటించారు. ఈ శాంక్చువరీ చేరిన తర్వాత, పర్యాటకులు , ఎన్నో ఎత్తులు, పల్లాలు, రివర్ వ్యాలీలు, కొండ చరియల అడవులు చూస్తారు. ఈ శాంక్చువరీ షుమారు 834.16 చ. కి.మీ. ల విస్తీర్ణంలో ఉంది. సముద్ర మట్టానికి 970 మీటర్ల ఎత్తులో ఉంది. ఈ శాంక్చువరీలో వివిధ రకాల జంతువులున్నాయి. పర్యాటకులు, లేడి, సంబార్, మచ్చల జింకలు, వివిధ రకాల పక్షులు, పాములు చూడవచ్చు. 200 జాతుల పక్షులున్నాయి. పర్యాటకులు ట్రెక్కింగ్, బోటింగ్ కూడా ఈ అడవిలో చేయవచ్చు. శాంక్చువరీ చూసేందుకు అక్టోబర్ నుండి జూన్ వరకు అనుకూలంగా ఉంటుంది. పర్యాటకులు టాపు లేని జీప్ లో ప్రయాణిస్తూ గైడ్ ద్వారా వివరాలు తెలుసుకొని ఆనందించవచ్చు. ఇక్కడే ఉన్న అంశి నేషనల్ పార్క్ కూడా సందర్శించవచ్చు.



Click it and Unblock the Notifications