దండేలి వెళ్లే ప్రయాణీకులు శిరోలి శిఖరం కూడా తప్పక చూడాలి. ఈ శిఖరం దండేలికి 25 కి.మీ. దూరంలో ఉంది. ఇది దండేలి వైల్డ్ లైఫ్ శాంక్చువరీలోకే వస్తుంది. శిరోలి శిఖరం చేరిన పర్యాటకులు అక్కడినుండి సహ్యాద్రి పర్వత శ్రేణులు చూడవచ్చు. షిరోలి పీక్ ఉత్తర కన్నడ ప్రాంతంలో అతి ఉన్నత శిఖరం కావటంవలన ఇది ట్రెక్కర్లు బాగా ఇష్టపడే ప్రదేశం. ఈ శిఖరంనుండి సూర్యాస్తమయం చూసి ఆనందిస్తారు. దండేలి వైల్డ్ లైఫ్ శాంక్చువరీ మరియు పడమటి కనుమలు కూడా కనపడతాయి. పర్యాటకులు అటవీ శాఖ అనుమతులతో ఈ ప్రాంతం ప్రవేశించవచ్చు.



Click it and Unblock the Notifications