గాంధి స్మృతి, ఢిల్లీ

జాతిపిత మహాత్మా గాంధీ తన జీవితంలో చివరి 144 రోజులు గడిపిన స్థలమే గాంధీ స్మృతి లేదా గాంధీ స్మృతి మ్యూజియం. గాంధీ స్మృతి ని ప్రారంభంలో బిర్ల హౌస్ లేదా బిర్లా భవనం అని పిలిచేవారు. జనవరి 30, 1948 న నాథూరాం గాడ్సే ద్వారా హత్య చేయబడిన ప్రదేశం కూడా ఇదే.

ఈ ఇంటిని 1971 లో కేంద్ర ప్రభుత్వం చేపట్టి, ఆగష్టు 15, 1973 న ప్రజల సందర్శనార్థం తెరిచారు. మహాత్మా గాంధీని కాల్చిన ఖచ్చితమైన ప్రదేశంలో అమరవీరుని స్థూపం కూడా ఉంది. ఈ మ్యూజియంలో గాంధీ జీవితానికి, మరణానికి స౦బంధించిన అనేక అంశాలు కూడా ఉన్నాయి.

ఈ మ్యూజియంలో అనేక ఛాయాచిత్రాల సేకరణ, ఆయన ఉపయోగించిన పుస్తకాలతో పాటు ఆయన వాడిన వస్తువులు కూడా కొన్ని ఉన్నాయి. డిల్లీ ని సందర్శించినపుడు గాంధీజీ నివసించిన ఈ స్థలం నిజానికి బిర్లా కుటుంబీకుల నివాస గృహం. ఈ మ్యూజియానికి బైటవైపు స్వస్తిక్ గుర్తుతో, దానిపై ‘ఓం’ గుర్తుఉన్న స్థంభం ఉంది.

శాంత పురుషుడైన గాంధీజీ జీవిత అనుభవాలను తెలుసుకోవాల౦టే మీరు ఈ ప్రాంతాన్ని తప్పక చూడాలి. ఆ ప్రాంతంలోని నిశ్చలమైన వాతావరణమే  మరిన్ని రోజులు ఉండేటట్లు  ప్రేరేపిస్తుంది. మ్యూజియం రోజు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు తెరిచి ఉంటుంది,  సోమవారాలు, జాతీయ శెలవురోజుల్లో మూసివేయబడి ఉంటుంది.

Please Wait while comments are loading...