సీతాదేవి సరస్సునే దేవికులం సరస్సు అని కూడా అంటారు. సుందరమైన ప్రదేశం కనుక పిక్నిక్ గా చాలామంది వస్తారు. ఇక్కడి నీరు అనేక ఖనిజలవణాలు కలిగి వ్యాధులను నివారించేదిగా ఉంటుంది. ఇక్కడి సరస్సులో వేడి నీటి బుగ్గ కూడా కలదు. ఇక్కడి ప్రకృతి దృశ్యాలు పర్యాటకులను పరవశింపజేస్తాయనటంలో సందేహం లేదు.
ఇంతటి పవిత్రమైన సరస్సుకు జతగా ఇతిహాసాల మేరకు రామాయణ కాలంనాటి సీతా దేవి ఈ సరస్సులో స్నానం చేసిందని చెపుతారు. పొడవైన చెట్ల నీడ, పచ్చటి నేల ప్రదేశం, చల్లని, స్వచ్ఛమైన నీరు రాళ్ళగుండా ప్రవహించటం, పక్షుల కిలకిలారావాలు, వంటి వాటితో సీతాదేవి సరస్సు ఒక చక్కటి వినోద ప్రాంతంగా చెప్పవచ్చు. స్వర్గం దిగివచ్చిందా అని అనిపించేలా వున్న ఈ ప్రాంతాన్ని పర్యాటకులు తప్పక చూడాలి.



Click it and Unblock the Notifications