Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» దుర్షీత్

దుర్షీత్ - ఒక సమీక్ష

10

దుర్షీత్  అంబానది ఒడ్డునకల ఒక ప్రశాంత గ్రామం. ఈ ప్రదేశం పాలి మరియు మహాడ్ లలోని అష్టవినాయక దేవాలయాల మధ్య కలదు. ఈ ప్రదేశం సుమారుగా 42 ఎకరాల అటవీ భూమిలో విస్తరించి వుంది.

దుర్షీత్ సహ్యాద్రి కొండల శ్రేణిలో అందాలతో అలరారుతూంటుంది. జాతీయ రహదారికి సమీపంలో ఖోపోలి గ్రామానికి దగ్గరగా ఉంటుంది. ఈ పర్యాటక ప్రదేశం దట్టమైన మామిడి మరియు మహు చెట్ల అడవులు తో నిండి ఉంటుంది. నగర జీవన రణగొణ ధ్వనులతో విసుగెత్తిన వారికి ఈ ప్రదేశం చక్కటి వారాంతపు విశ్రాంతికి సరైన ఎంపికగా ఉంటుంది.  ముంబై మరియు పూనే నగరాలకు ఈ ప్రదేశం సమీపంగా ఉండటంతో ఎల్లపుడూ పర్యాటకులను అధిక సంఖ్యలో పొందుతూంటుంది.   

దుర్షీత్ - ఒక పచ్చని గ్రామంగంభీరంగా నిలబడే సహ్యాద్రి కొండల శ్రేణులలో కల దుర్షీత్ ప్రదేశం పచ్చని చెట్లతో అనేక పక్షులతో ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. వివిధ రకాల పక్షులు ఇక్కడి చెట్లపై గూళ్ళు కట్టి నివాసం ఉంటాయి. ఈ పక్షుల కూతలు వినసొంపుగా ఉంటాయి. ఇక్కడి గాలి ఏ మాత్రం కలుషితం లేక ఎంతో తాజాగా ఉంటుంది.  ఎక్కడ చూసినా పచ్చదనమే.

చల్లటి తాజా గాలులు, కంటికింపైన పచ్చటి ప్రదేశాలు పర్యాటకులకు మరువలేని అనుభూతులు కలిగిస్తాయి. ఈ ప్రదేశ అందాలను పూర్తిగా ఆస్వాదించాలంటే వర్షాకాలం ఎంతో అనుకూలమైనది.

దుర్షీత్ లో చూడదగిన ప్రదేశాలు ఏవి? అద్భుత ప్రకృతి సౌందర్యంకల దుర్షీత్ ట్రెక్కర్లకు, వైల్డ్ లైఫ్ సఫారీలకు ఎంతో ప్రియమైన ప్రదేశం. ఇక్కడ గల పాలి గణపతి దేవాలయం మరియు మహాడ్ గణపతి దేవాలయాలు రెండూ తప్పక చూడదగిన మతపర ప్రదేశాలు. మీ భక్తి విశ్వాసాలను మరింత అధికం చేస్తాయి.  

ఈ ప్రదేశం గురించిన మరో వాస్తవం ఏమంటే, దుర్షీత్ ప్రదేశం ఛత్రపతి శివాజీ మహారాజు కార్తాలాబ్ ఖాన్ తో యుంబర్ ఖిండ్ ప్రదేశం కొరకు యుద్ధం చేసినపుడు  ఒక యుద్ద ప్రదేశంగా కలదు. దుర్షీత్ కు వాయు, రైలు, రోడ్డు ఏ మార్గంలో అయినా సరే చేరవచ్చు.

దుర్షీత్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

దుర్షీత్ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం దుర్షీత్

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? దుర్షీత్

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు ప్రయాణం దుర్షీత్ కు రోడ్డు ప్రయాణం చేయాలనుకునేవారికి మహా రాష్ట్ర లోని వివిధ ప్రదేశాలనుండి ఇతర రాష్ట్రాలనుండి వివిధ మార్గాలలో బస్ లు నడుస్తాయి. ముంబై నుండి బస్ లో చేరాలనుకుంటే ఛార్జి సుమారుగా రూ. 250 వరకు ఉంటుంది.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు ప్రయాణం దుర్షీత్ పట్టణం కొంకణ్ రైల్వే లైనుపై కలదు. ముంబై నగర విక్టోరియా టర్మినస్ స్టేషన్ సమీప రైలు స్టేషన్. విక్టోరియా టర్మినస్ నుండి భారతదేశంలోని అన్ని నగరాలకు రైళ్ళు కలవు. విమానాశ్రయం వలెనే, ఈ రైలు స్టేషన్ నుండి కూడా టాక్సీలలో దుర్షీత్ చేరవచ్చు. టాక్సీ ఛార్జీలు షుమారుగా రూ.2000 వరకు ఉంటాయి.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    విమాన ప్రయాణం దుర్షీత్ కు వాయు మార్గంలో చేరాలంటే ముంబై లోని ఛత్రపతి శివాజి అంతర్జాతీయ విమానాశ్రయం సుమారు 105 కి.మీ.ల దూరంలో ఉంటుంది. ఈ విమానాశ్రయంనుండి దేశంలోని ఇతర ప్రధాన నగరాలకు మరియు విదేశాలకు ప్రతి రోజూ విమానాలు నడుస్తాయి. విమానాశ్రయంనుండి దుర్షీత్ కు టాక్సీలలో చేరవచ్చు టాక్సీ ఛార్జీలు సుమారుగా రూ.2000 వరకు ఉంటాయి. పూనే లోని లోహేగాంవ్ విమానాశ్రయం మరియు నాశిక్ లోని గాంధీనగర్ విమానాశ్రయం రెండూ కూడా విమాన ప్రయాణానికి అనుకూలమే.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
30 Mar,Mon
Return On
31 Mar,Tue
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
30 Mar,Mon
Check Out
31 Mar,Tue
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
30 Mar,Mon
Return On
31 Mar,Tue