గడగ్ లో సూడి ప్రసిద్ధ పట్టణం. ఇక్కడ శిల్పాలు చెక్కుతారు. సూడి పట్టణం భారత పురావస్తు శాఖ అధీనంలోకి వచ్చిన తర్వాత మరింత ప్రసిద్ధి కెక్కింది. ఈ పట్టణం సర్కా 1000 నుండి అంటే కళ్యాణి చాళుక్యుల పాలననుండి శిల్పాలు చెక్కడంలో ప్రసిద్ధి. కొన్ని శతాబ్దాల క్రిందటి వరకు ఇక్కడ పడమటి చాళుక్యుల శిల్పశైలి సాగేది.
ఇక్కడ ప్రసిద్ధి గాంచిన చిహ్నాలు అంటే మల్లిఖార్జున దేవాలయం, రెండు జంటల దేవాలయం మరియు నాగకుండ. ఇంకా, పెద్ద గణపతి విగ్రహం, ఈశ్వర లింగం కూడా కలవు. హూడే అనే టవర్ మరియు పెద్ద శివ లింగం కలవు. ఇంత ఆకర్షణ కల స్మారకాలుండటం చేత సూడి గడగ్ లో పర్యాటకులు తప్పక చూడవలసిన ప్రదేశంగా మారింది.



Click it and Unblock the Notifications