ఫరీద్ నగర్ ఘజియాబాద్ జిల్లాలోని మోడీ నగర్ తాలుకాలో ఒక చిన్న టవున్. ఇది ఘజియాబాద్ కు 30 మైళ్ళ దూరంలో బెగామబాద్ - హపూర్ రోడ్ లో కలదు. మొగల్ చక్రవర్తి అక్బర్ ఆస్థానం లో కల ఒక అధికారి అయిన ఫరీద్ ఉద్ దిన్ ఖాన్ పేరును ఈ టవున్ కు పెట్టారు. అతని విశ్వాసానికి మెచ్చిన అక్బర్ అతనికి ఈ టవున్ ను బహుమతి గా ఇచ్చాడని చెపుతారు. ఫరీద్ నగర్ ఒక సైనిక స్థావరం. మొగల్ సైనికులు ఇక్కడ వుండేవారు. అక్బర్, జహంగీర్ ల కాలం లో ఈ టవున్ లో నాణెముల ముద్రణ ఫ్యాక్టరీ వుండేది. అక్బర్ కాలంలో ఈ టవున్ వైభవంగా వుండేది. ఇక్కడే ఒక జామా మసీద్ కూడా కలదు.
హపూర్ చారిత్రాత్మక హపూర్ టవున్ ఘజియాబాద్ లో ఒక పెద్ద తాలుకా. ఘజియాబాద్ కు 34 కి. మీ.లు, ఢిల్లీ కి సుమారు 60 కి.మీ.ల దూరంలో వుంటుంది. హపూర్ నేషనల్ కాపిటల్ ప్రాంతం లో ఒక భాగం. ఈ టవున్ ను హరదట్ట అనే బులంద్శార్ ప్రభువు క్రి.శ.983లో నిర్మించాడని చెపుతారు.
హపూర్ పట్టణం అప్పడాలకు ప్రసిద్ధి. ఇక్కడ తయారయ్యే అప్పడాలు చాలా రుచికరంగా వుంటాయి. మొదట్లో ఈ టవున్ కు అయిదు గేటులు ఉండేవి. ఇక్కడే 1670 లో ఔరంగజేబ్ చే నిర్మించ బడిన ఒక మసీదు కలదు. చండి మందిర్, సాబ్లి శివ మందిర్ , దూదేస్వర్నాత్ మందిర్ వంటి హిందూ దేవాలయాలు కూడా కలవు.