గోముఖ్ గంగోత్రి హిమానీనదం యొక్క ముగింపుకు గుర్తుగా ఉన్న అందమైన ప్రదేశం. ఇది ఉత్తరాఖండ్ లోని ఉత్తర కాశీ జిల్లాలో ఉంది. ఈ స్థలం కష్టతరమైన ఆరోహణ బాటలకు ప్రసిద్ధి చెందిన శివ లింగం శిఖరం సమీపంలో ఉంది. గంగా నది యొక్క ముఖ్య ఉపనది భాగీరథి నది గోముఖ్ వద్ద పుట్టింది. ఈ స్థలం తపోవనం పచ్చికబయలుకి దగ్గరలో ఉంది. ఇది సందర్శకులను తన సహజ సౌందర్యంతో ముగ్దులను చేస్తుంది.
పర్యాటకులు గోముఖ్ లో అనేక పర్యాటక ప్రదేశాలు చూడవచ్చు. గంగోత్రి హిమానీనదం వాటిలో ప్రముఖమైనది. ఇది హిమాలయ ప్రాంతం యొక్క అతిపెద్ద హిమానీనదాలలో ఒకటి. ఇది శివ లింగం, తలయ సాగర్, మేరు మరియు భాగీరథి III అనే మంచుతో కప్పబడిన శిఖరాలతో చుట్టబడి ఉంది. హిమానీనదం యొక్క చివరి భాగం ఆవు నోరుని పోలి ఉండటం వల్ల, ఈ స్థలం గోముఖ్ (ఆవు నోరు అని అర్థం) అని పిలవబడుతుంది.
ఈ ప్రదేశం పర్యాటకులకు ప్రత్యేక ట్రెక్కింగ్ అవకాశాలను అందిస్తుంది. ప్రముఖ పర్వతారోహణ మార్గం గంగోత్రి వద్ద ప్రారంభమయి గిలా పహార్ మరియు చిర్బాసా గుండా వెళుతుంది. ఇది భూపాతాలు మరియు అధిక వాలు ప్రాంతాలతో నిండిన క్లిష్టమైన మార్గం. తపోవనం,నందనవనం కి ట్రెక్కింగ్ కూడా గోముఖ్ వద్దే ప్రారంభమవుతుంది.
పర్యాటకులు డెహ్రాడూన్ యొక్క జాలీ గ్రాంట్ విమానాశ్రయం నుండి ఇక్కడికి చేరుకోవచ్చు. గంగోత్రి నుండి 230 కి.మీ.ల దూరంలో ఉన్న హరిద్వార్ సమీప రైల్వే స్టేషన్. బస్సులు కూడా సమీప నగరాలు నుండి ఇక్కడికి అందుబాటులో ఉన్నాయి. గోముఖ్ పర్యటనకు ఆసక్తి చూపే యాత్రికులు వేసవిలో ఈ స్థలాన్ని సందర్శించడం మంచిది.



Click it and Unblock the Notifications