నగరం నడిబొడ్డు లో ప్రసిద్ది చెందిన గోరఖ్నాత్ ఆలయం ఉంది. గోరఖ్నాథ్ యోగి ధ్యానం చేసిన ప్రాంతంలో నే ఈ ఆలయం నిర్మించారని అంటారు. ఆయన శిష్యులు ఈ ఆలయాన్ని నిర్మించారు. 52 ఎకారాల నేల పై నిర్మించిన అధ్బుతమైన నిర్మాణం ఇది. గర్భగుడిలో మహా శివుడి అవతారంలో గోరఖ్నాథ్ యోగి యొక్క చిత్తరువు ఈ ఆలయం యొక్క ముఖ్య లక్షణం. ఈ ఆలయానికి పక్కనే ఉన్న కొలనుని మానస సరోవరం అని అంటారు. ధ్యానం చేసేందుకు అలాగే సుదీర్ఘ పడవ ప్రయాణాల కొరకు అధిక మంది పర్యాటకులు ఇక్కడికి వస్తారు. ఇది పేరొందిన పర్యాటక ఆకర్షణ కూడా.
జనవరి 14 నుండి నెల పాటు కొనసాగే 'మకర సంక్రాంతి మేళా' ని ఇక్కడ నిర్వహిస్తారు. లక్షల మంది తీర్ధ యాత్రికులను అలాగే పర్యాటకులను ఈ మేళా ఆకర్షిస్తుంది.



Click it and Unblock the Notifications