నింగ్లె నల్లా, గుల్మార్గ్ కు 10 కి. మీ. ల దూరం లో కల అందమైన ఒక ప్రవాహం. ఈ ప్రవాహం లోకి అఫర్వాట్ శిఖరం నుండి వేసవిలో మంచు కరిగి నీరు ప్రవహిస్తుంది . ఈ ప్రవాహం తదుపరి సోపోరే వద్ద జీలం నది లో కలసిపోతుంది. పచ్చిక ప్రదేశాలు కల ఈ ప్రాంతం చక్కని వినోద సమయం గడపాలనుకునే కుటుంబాలకు, పిల్లలకు బాగుంటుంది. వికసించే పూవుల ప్రదేశాలు, పైన్ చెట్లు, మంచుతో కప్పబడిన కొండలతో ప్రదేశం అందంగా వుంటుంది. సందర్శకులు నింగ్లె నల్లా ప్రదేశాన్ని రోడ్ మార్గంలో తేలికగా చేరవచ్చు. టాక్సీలలో కూడా వెళ్ళవచ్చు.



Click it and Unblock the Notifications