హళేబీడు సందర్శించేవారు బేలవాడి తప్పక చూడాలి. ఈ జాతీయ వారసత్వ ప్రదేశం అందాలకు పేరుగాంచినది. పచ్చటి చెట్లు, ప్రదేశాలు కలిగి ఉంటుంది. ఇది జావగల్ - చిక్కమగళూరు మార్గంలో కల ఒక గ్రామం. చరిత్రలో ఎంతో పేరుపడింది. ప్రస్తుతానికి పాత బెలవాడి ఖాళీగా కనపడుతుంది. దీనిలోని నివాసితులందరూ కొత్త బెలవాడిలో స్ధిరపడ్డారు. ఈ గ్రామంలో హొయసల శిల్ప సంపద కల శ్రీ వీరనారాయణ దేవాలయం ఉంటుంది. దేవాలయాన్ని అందమైన శ్రీ వీరనారాయణ, శ్రీ వేణుగోపాల మరియు శ్రీ యోగనరసింహ విగ్రహాలుకల త్రికూట దేవాలయంగా పరిగణిస్తారు. బెలవాడి గ్రామం 17వ శతాబ్దంలో మరాఠా రాజు శివాజీతో తలపడిన బెలవాడి మల్లమ్మ చరిత్రకు కూడా ప్రసిద్ధి



Click it and Unblock the Notifications