అనెగుండి గ్రామం హంపికి సుమారు 10 కి.మీ.ల దూరంలో తుంగభద్రనది ఒడ్డున కలదు. ఇది ఒకప్పుడు విజయనగరసామ్రాజ్యానికి ప్రాంతీయ రాజధానిగా ఉండేది. కన్నడంలో అనెగుండి అంటే, ఏనుగుల గొయ్యి అని అర్ధం చెపుతారు. ఈ ప్రాంతం హంపి కంటే కూడా పురాతనమైంది. రామాయణం మేరకు ఈ ప్రదేశం కోతి రాజైన సుగ్రీవుడు పాలించిన కిష్కింధగా చెపుతారు.ఇక్కడి కల అంజనాద్రి హిల్ అంటే, హనుమంతుడి జన్మ స్ధలాన్ని కూడా పర్యాటకులు దర్శించవచ్చు.
హంపి బజార్ లో వలే కాక, అనెగుండి గ్రామం చాలా ప్రశాంతంగా ఉంటుంది. వారసత్వ సంరక్షణ ప్రాజెక్టు, కిష్కింధ ట్రస్ట్ పర్యాటకులకు మంచి సౌకర్యాలు ఏర్పరచాయి. తుంగభద్ర నదిపై ఒక కొత్త బ్రిడ్జి నిర్మాణం చేశారు. దీనిపైనుండి అనెగుండికి త్వరలో తేలికగా చేరవచ్చు. అప్పటివరకు ఆసక్తి కలవారు ఈ ప్రాంతానికి తెప్ప ప్రయాణంలో రావలసిందే.
గగన్ ప్యాలెస్, పంపా సరోవర లక్ష్మీ దేవాలయం (సరస్సు), శ్రీ క్రిష్ణదేవరాయ సమాధి, అనెగుండి కోట, ప్రవేశ గేటు మరియు ఏడు తలల పాము వంటివి అనెగుండిలో మరిన్ని ఆకర్షణలు. పర్యాటకులు శ్రీ గావి రంగనాధ దేవాలయం, గణేశ దేవాలయం, చింతామణి శివ దేవాలయం, హుచ్చయప్పన మఠం మరియు జైన మందిరాలను కూడా ఇక్కడ చూడవచ్చు.



Click it and Unblock the Notifications