ఈ దేవాలయం రాచ మందిర మధ్య భాగాన ఉంటుంది. హంపిలో ఒక ప్రధాన ఆకర్షణ. వేడుకల సమయంలో ఈ ప్రదేశాన్ని ఉపయోగించేవారు. రామాయణ గాధలు ఇక్కడ చెక్కబడ్డాయి. హంపిలో విష్ణు భగవానుడికి అర్పించిన దేవాలయాలలో ఇది ఒకటి. ఈ దేవాలయ గోడలు 15వ శతాబ్దపు శిల్ప చాతుర్యంతో ఏనుగులు, గుర్రాలు, సైనికులు, నాట్య భంగిమలతో చెక్కబడ్డాయి.
హజార రామ దేవాలయ సమీపంలో లోటస్ మహల్ జెనానా మహల్ ఉన్నాయి. ఇక్కడే ఒక పెద్ద బుద్ధ ప్రతిమ కూడా ఉంది. అర్ధ మంటపానికి ఉన్న నాలుగు స్తంభాలు శిల్పకళా నైపుణ్యంతో ఎంతో అందంగా ఉంటాయి.



Click it and Unblock the Notifications