విఠల దేవాలయం విష్ణమూర్తి దేవాలయం. ఇది 16వ శతాబ్దం నాటిది. ఎంతో అందమైన శిల్పశైలికల దీనిని హంపి వెళ్ళే పర్యాటకులు తప్పక చూడాలి. ఈ ప్రాంతంలోని దేవాలయాలలో ఇది ప్రధాన ఆకర్షణ. దీనికి సాటి అయిన దేవాలయం మరొకటి లేదు. ఈ దేవాలయం తుంగభద్ర నది దక్షిణం ఓడ్డున కలదు. అసలైన దక్షిణ భారత ద్రవిడ దేవాలయ శిల్పశైలి దీనిలో కనపడుతుంది. విఠల దేవాలయం రాజు దేవరాయ II పాలనలో నిర్మించబడింది. విజయనగర సామ్రాజ్య తీరుతెన్నులు పుణికి పుచ్చుకొంది.
అలంకరించబడిన స్తంభాలు, చెక్కడాలు కల ఈ దేవాలయం పర్యాటకులకు అద్భుత ఆనందం కలిగిస్తుంది. ఇక్కడ మీరు చూడవలసినది రంగ మంటపం మరియు 56 మ్యూజికల్ స్తంభాలు. వాటిని ముట్టుకుంటే చాలు సంగీతం వస్తుంది. విగ్రహాలను లోపల గర్భగుడిలో ప్రధాన పూజారి మాత్రమే ప్రవేశం కల ప్రదేశంలో ఉంచారు. చిన్న గర్భగుడి లోకి భక్తులు ప్రవేశించవచ్చు. అలంకరణ అంతా బయటే కనపడుతుంది. ఏక శిలతో నిర్మించిన రధం ప్రధాన ఆకర్షణ. ప్రాంగణంలో తూర్పు వైపున, కల ఇది రధం ఎంత బరువైనప్పటికి రాతి చక్రాలతో తేలికగా కదిలిపోతుంది. అనేక మంటపాలు, దేవాలయాలు, హాళ్ళు కూడా దేవాలయ సముదాయంలో కలవు.



Click it and Unblock the Notifications