పురాతన గ్రందాల మేరకు ఒకప్పుడు, లార్డ్ ఆదినాధుడు తన రాజ్యాన్ని పరిత్యజించి తపస్సు చేస్తూ ఉపవాస దీక్ష లో ఒక సంవత్సరం గడిపాడు. ఉపవాసం ఎలా విరమింప చేయాలో ఎవరికీ తెలియక ఇలా కొంత కాలం సాగిపోయింది. చివరకు హస్తినాపూర్ రాజు చిన్న సోదరుడు తన గత జన్మ సంస్కారంగా ఉపవాస దీక్ష విరమణ తెలుసు కొని ఆదినాదుడికి ఒక గ్లాస్ చెరకు రసం ఇచ్చి విరమింప చేస్తాడు. ఇది వైశాఖ శుక్ల త్రితీయ రోజు జరుగుతుంది. ఈ సంఘటనకు గుర్తుగా రాజు అక్కడ ఒక స్తూపాన్ని, టెంపుల్ ను కట్టిస్తాడు.
లార్డ్ ఆదినాత్దుడి కాలి ముద్రలు ఒక రాతి పై చేక్కిస్తాడు. ఈ నిష్యజి టెంపుల్ హస్తినాపూర్ లోని గంగ నది ఒడ్డున కలదు. వేలాది భక్తులు అక్కడకు వచ్చి ఆదినాధుని కాలి ముద్రలు దర్శించి వెళతారు. టెంపుల్ లో అక్షయ త్రితీయ నాడు, హోలీ మరియు కార్తిక పూర్ణిమ రోజు ఘనంగా వేడుకలు జరుగుతాయి. ప్రతి సంవత్సరం మార్చ్ నెలలో ఒక మహాయాగం నిర్వహిస్తారు.



Click it and Unblock the Notifications