హస్తినాపూర్ అంటే సిటీ అఫ్ ఎలేఫెంట్స్ అని అర్ధం. మహాభారతం లోని కౌరవుల రాజ్యానికి రాజధాని. కురుక్షేత్రంలో జరిగిన కౌరవ, పాండవ సంగ్రామంకు పునాదులు హస్తినాపూర్ లో పడ్డాయి. యుద్ధం తర్వాత పాండవులు కొంతకాలం హస్తినాపూర్ లో తమ రాజ్యం పాలించారు. పాత హస్తినాపూర్ పట్టణంలో పురాతన పాన్దేశ్వర్ టెంపుల్ కలదు. దీనిలో శివుడు ఉంటాడు. ఇతిహాసం మేరకు ఈ శివలింగం దానవీరుడైన కర్ణుడు ప్రతిష్టించాడని చెపుతారు. కర్ణుడు యుద్ధంలో కౌరవుల పక్షాన పోరాడాడు. ఈ టెంపుల్ ఒక కొండ పై బెంగాలీలు నిర్మించిన కాళీ మాత టెంపుల్ కు దిగువన వుంటుంది. ఈ టెంపుల్ నుండి హస్తినాపూర్ పట్టణం దృశ్యాలు చూడవచ్చు.