టైగర్ రిజర్వులకి ప్రసిద్ది చెందినా సత్పుర నేషనల్ పార్క్ వివిధ రకాల వృక్ష మరియు జంతు జాలాలకి స్థావరం. ఈ ప్రాంతం భారత దేశం లో ని పాడుకాని వైల్డ్ లైఫ్ సాంచురీలలొ ఒకటి. పులుల పరిరక్షణ ఉద్దేశ్యం తో ప్రారంభమయింది ఈ సాంచురీ. ఈ పార్క్ ఎగుడు దిగుడు స్థలం ఇంకా లోతైన లోయలు, జలపాతాలు మరియు ఇరుకైన సన్నటి త్రోవల తో ఉంది. ఈ పార్క్ అంతా సందర్శిస్తున్నప్పుడు సాండ్ స్టోన్ పీకాక్స్, దట్టమైన పచ్చటి సాల్ అడవులు మరియు విశాలమైన తవా రిజర్వాయర్ ల ని చూసి ఆశ్చర్యపోకూడదు. సత్పుర నేషనల్ పార్క్ ని సందర్శిస్తున్నప్పుడు పర్యాటకులకి మచ్చల జింక, పులులు, చిరుత మరియు బురద మొసళ్ళను చూసే అవకాశం లభిస్తుంది.
బ్లాకు బక్ మరియు ఇండియన్ జైంట్ స్క్విరెల్ ఈ ప్రాంతం యొక్క విశిష్టమైన ఆకర్షణలు. ఈ నేషనల్ పార్క్ లో ఉన్న అనేక రకాల పక్షుల ను చూడడానికి సంతోషంగా ఉంటుంది. సత్పుర నేషనల్ పార్క్ లో దాదాపు 1300 రకాల మొక్కలు కలవు. వీటిలో ఔషద మొక్కలు కూడా ఉన్నాయి. ప్రపంచం లో నే నడకకి అనువుగా ఉన్న ఏకైక టైగర్ రిజర్వ్ ఇది. నలుగురు వ్యక్తులు కలిగిన ఒక బృందాన్ని శిక్షణ పొందిన వైల్డ్ లైఫ్ ఎక్స్పర్ట్ ని రక్షణ తో ఈ టైగర్ రిజర్వ్ లో నడకకు అనుమతినిస్తారు. జనవరి నుండి జూన్ వరకు ఈ పార్క్ ని సందర్శించేందుకు ఉత్తమ సమయం.



Click it and Unblock the Notifications