హుబ్లీ నగర సందర్శనలో పర్యాటకులు నుగ్గికెరి హనుమాన్ దేవాలయం తప్పక చూడాలి. ఈ ప్రాంతంలో ఈ దేవాలయం ప్రసిద్ధి గాంచింది. ఇక్కడ ప్రఖ్యాత సెయింట్ శ్రీ వ్యాసరాజు ప్రతిష్టించిన ఒక పురాతన దైవ విగ్రహం కూడా చూడవచ్చు. ప్రస్తుతం ఈ శిల్పాన్ని దేశాయి కుటుంబం నిర్వహిస్తోంది. శనివారాలు జనాలు బాగా వస్తారు. ప్రస్తుతం దీని పరిసర ప్రదేశాలు పునరుద్ధరించబడుతున్నాయి.