ఇడుక్కి జిల్లాలో ఉన్న ప్రసిద్దమైన హిల్ స్టేషన్ ల లో కులమవు ఒకటి. ఇది సముద్ర మట్టం నుండి 3000 అడుగుల ఎత్తులో ఉంది. అసాధారణ అందం వల్ల ఈ ప్రాంతం ఏంతో మంది పర్యాటకులని ఆకర్షిస్తుంది. ట్రెక్కింగ్ కి కూడా అనువైన ప్రదేశం. ఇడుక్కి రిజర్వాయర్ ప్రాజెక్ట్ లో ఉన్న మూడు డ్యాం ల లో ఈ కులమావు డ్యాం ఒకటి. ఏంతో మంది పర్యాటకులని ఈ డ్యాం ఆకర్షిస్తుంది.
33 చదరపు కి మీ లు ఉన్న ఈ కులమవు రాతి కొండల మధ్య ఉంది. కులమవు డాం నుండి చేరుతోని వరకు పడవ ప్రయాణం చేసే సదుపాయం కూడా ఉంది. ఇక్కడికి సమీపంలో ఉన్న మూలమత్తోం భూగర్భ విద్యుత్ కేంద్రం కూడా చూడదగిన ప్రదేశం. కులమవు నుండి ఇడుక్కి వైల్డ్ లైఫ్ సాంచురి ని కూడా సందర్శించవచ్చు. ప్రసిద్ది చెందిన నడుకనిఘాట్స్ ఇక్కడ నుండి 70 కి మీ ల దూరం మాత్రమే.



Click it and Unblock the Notifications