ఇడుక్కి లో ఉన్న ఉడుమ్బంచోల తాలూకా వద్ద ఉన్ననేడుంకందం హిల్స్ సముద్ర మట్టం నుండి 3200 కి మీ ల ఎత్తు నుండి పడతాయి. ఈ గ్రామం మున్నార్ మరియు తట్టేక్కాడ్ బర్డ్ సాంచురి ల మధ్యలో రోడ్డు నుండి 3 కి మీ ల దూరంలో విస్తరింపబడి ఉన్నది. ఈ ప్రాంతంలో కాఫీ, ఇలాచీ మరియు మిరియాలు పండిస్తారు.
కేరళ లో వేగంగా అభివృద్ధి చెందుతున్న పట్టణాలలో ఇది ఒకటి. కేరళ మరియు తమిళ్ నాడు లో వివిధ ప్రాంతాల నుండి ఇక్కడికి వచ్చిన రైతులు ఈ ప్రాంతంలో వ్యవసాయం చేస్తున్నారు. హాయిగా విశ్రాంతి తీసుకోవాలనుకుంటే ఇక్కడికి విచ్చేయండి. నేడుంకందం హిల్స్ పరిసర ప్రాంతాల లో ఎన్నో అద్భుతమైన ప్రాంతాలు సందర్శనీయ ప్రాంతాలు ఉన్నాయి.
కైలసపుర, కల్లుమేకల్లు,నేయ్యందిమల, రామక్కల్మేడు మరియు మంకుతిమేడు వంటి ప్రదేశాలకి పిక్నిక్ ల కి వెళ్లి సరదాగా గడపవచ్చు. తూవాల్ ఫాల్స్ ని సందర్శించి ప్రకృతిలోని సంగీతాన్ని విని ఆనందించవచ్చు.