ఇడుక్కి జిల్లాలో ఉన్న తోడుపుజ్హ నగరం నుండి 17 కి మీ ల దూరంలో ఉన్న తోమ్మంకుతు ఫాల్స్ 1500 మీ ల ఎత్తు నుండి పడతాయి. ఈ జలపాతం చిన్నదయినా అత్యంత ఆకర్షణ కలిగినది. ఈ జలపాతాన్ని, చుట్టు పక్కల ప్రకృతి సౌందర్యాన్ని సందర్శించేందుకు ఎందరో పర్యాటకులు ఇక్కడికి తరలి వస్తారు.తోమ్మన్ అనే గిరిజన నాయకుడి పేరునే ఈ జలపాతానికి పెట్టారు.
ఇతను నదిని దాటుతుండగా ఈ జలపాతం లోపడి కొట్టుకుపోయాడు. ఏడు మెట్ల జలపాతంగా దీనిని పేర్కొంటారు. జలపాతం నుండి నీళ్ళు కిందకి పడుతున్నప్పుడు ఏడు మెట్లగా ఏర్పడింది. ప్రతి మెట్టులో కొలను ఏర్పడింది. తోమ్మంకుతూ ఫాల్స్ అందం ఈ మెట్ల లో నే ఉంది. హృదయాన్ని ఉత్తేజ పరిచే రాక్ క్లైంబింగ్, హైకింగ్,ట్రెక్కింగ్ వంటి కార్యక్రమాలకు అనువైన ప్రదేశం. ఇవే కాకుండా ఫిషింగ్, బోటింగ్, గుర్రపు స్వారీ వంటి కార్యక్రమాలు కూడా పర్యాటకులని అమితంగా ఆకర్షిస్తున్నాయి.



Click it and Unblock the Notifications