1980లో స్థాపించిన ఎడారి జాతీయ పార్క్ థార్ ఎడారి పర్యావరణ వ్యవస్థను ప్రతిబింబిస్తుంది. ఈ జాతీయ పార్కు 3161 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి వుంది. ఈ పార్క్ లోని నేలలో ఉప్పు నీటి నేల, స్థిరమైన దిబ్బలు, రాళ్ళు వుంటాయి. హారియర్లు, బజ్జర్డ్ లు, మచ్చల గద్దలు, పొట్టి కాలి గద్దలు, టానీ గద్దలు, రాబందులు, పెద్ద ఫాల్కన్లు, సాండ్ గ్రౌస్ లు లాంటి పక్షుల జాతులు ఇక్కడ చూడవచ్చు.
అంతరించి పోతున్న రాజస్థాన్ రాష్ట్ర పక్షి గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ కు ఈ పార్క్ సహజ ఆవాసం. రాజబాగ్ సరస్సు, మిలాక్ సరస్సు, పదం తలావ్ సరస్సు ఈ పార్కులోపల వున్న ప్రధాన జలాశయాలు. నవంబర్ – జనవరి నెలల మధ్య ఈ పార్కును సందర్శించడం ఉత్తమం.



Click it and Unblock the Notifications