జైసల్మేర్ నగరానికి 42 కిలోమీటర్ల దూరంలోని ఖురీ గ్రామంలో ఖురీ ఇసుక తిన్నెలు వున్నాయి. ఇక్కడి ఎడారి ఇసుక తిన్నెల్లో యాత్రికులు ఒంటెలపై సవారీని ఆస్వాదించవచ్చు. మట్టి, గడ్డితో నిర్మించిన ఇళ్ళు ఈ గ్రామం అందాన్ని మరింత శోభాయమానం చేస్తాయి. సాయంత్రపు చలిమంటలు, జానపద గీతాలు, రాజస్థాన్ సున్నిత నృత్య రీతి కల్బెలియా నృత్యం జైసల్మేర్ సందర్శనను మరపురాని అనుభూతిగా మారుస్తాయి. జైసల్మేర్ నుంచి బస్సుల ద్వారా యాత్రికులు ఖురీ గ్రామాన్ని చేరుకోవచ్చు.



Click it and Unblock the Notifications