జైసల్మేర్ కోట బయట వున్న మానక్ చౌక్, హవేలీలు ప్రధాన పర్యాటక ఆకర్షణలు. ఇక్కడి హవేలీలు అందమైన కళాకృతులు చేతి పనులతో అలంకరించబడి వుంటాయి. ఈ హవేలీలు అన్నిటిలో పట్వోన్ కీ హవేలీ, సలీం సింగ్ కీ హవేలీ, నాద్ మల్ జీ కీ హవేలీ ప్రసిద్ధ కట్టడాలు.
మార్కెట్ గా ఉపయోగించబడే ఈ ప్రదేశం మొత్తాన్ని సదర్ మండీ అంటారు. ఒకప్పుడు ఇరాక్, ఈజిప్ట్, పర్షియా, అరేబియా దేశాల వర్తకులతో కిటకిటలాడిన ప్రసిద్ధ ధాన్యం మార్కెట్ గా ఈ ప్రాంతం ప్రసిద్ది చెందింది. మార్కెట్ ప్రాంతంలో వున్న మానక్ చౌక్ తోలుతో చేసిన అలంకరణ వస్తువులు, సాంప్రదాయ వెండి నగలు, చేతి పనులు, ప్రాచీన కళాకృతులు కొనుగోలు చేసేందుకు ప్రఖ్యాత షాపింగ్ కేంద్రం. స్థానిక తయారీదారులు సృజనాత్మక కళాకృతులను తయారు చేస్తుండగా యాత్రికులు చూసే అవకాశం వుండే అరుదైన మార్కెట్ ప్రాంతం ఇది.



Click it and Unblock the Notifications