జైసల్మేర్ నగరంలోని బాదల్ పాలెస్ సముదాయానికి దగ్గరలో ఉన్న ఐదు అంతస్తుల భవంతి ఈ తాజియా టవర్. ఈ భవంతిని ముస్లిం చేతివృత్తుల వారు మహారావల్ బేరిసల్ సింగ్ కు కానుకగా ఇచ్చారు. కర్బలా లో ముహారం పండుగ సమయంలో తీసుకువెళ్ళే చెక్కతో, వెదురుతో, కాగితంతో చేసే ‘తాజియా’ అనే నమూనాను ఈ నిర్మాణ శైలి పోలి ఉంటుంది. ముఘలాయి, రాజపుత్ర మిశ్రమ నిర్మాణ శైలికి, అందమైన నమూనాలకు తాజియా టవర్ సుప్రసిద్ధం. ఇమామ్ ల సమాధి నమూనాకు ఈ కట్టడం నకలుగా ఉంటుంది. ప్రతి అంతస్తులోనూ పక్కవాటికన్నా నమూనాలోనూ, నిర్మాణ శైలిలోనూ విభిన్నంగా ఉండే బాల్కనీలను యాత్రీకులు చూడవచ్చు.



Click it and Unblock the Notifications