అమర్ మహల్ ను 1890 లో డోగ్రా పాలకుడు రాజా అమర్ కట్టించారు. ఈ నిర్మాణాన్ని ఒక ఫ్రెంచ్ ఆర్కిటెక్ట్ రూపొందించారు. కనుక ఇది ఒక ఫ్రెంచ్ దేశ కట్టడం గా కనపడుతుంది. అమర్ మహల్ నిర్మాణం లో ఎర్ర ఇసుక రాయి ఉపయోగించారు.
గతం లో అమర్ మహల్ రాజ కుటుంబ సభ్యులకు ఒక నివాసంగా వుండేది. తర్వాతి కాలం లో దీనిని ఒక మ్యూజియం చేసి అందులో పుస్తకాలు, చిత్రాలు, రాజ శాసనాలు వంటివి ఉంచారు. ఈ మ్యూజియం ప్రధాన ఆకర్షణ దుర్బార్ హాల్. దీనిలో పహారీ పెయింటింగ్ లు , జమ్మూ , కాశ్మీర్ రాజ్య గత పాలకుల చాయా చిత్రాలు వుంటాయి. మహారాజ హరి సింగ్ సింహాసనం సుమారు 120 కే.జి. ల బరువుగలది ఈ మ్యూజియం లో చూడవచ్చు.
పర్యాటకులు ఇక్కడ సుమారు 20,000 పుస్తకాలను ఒక లైబ్రరీ లో చూడవచ్చు. ఈ పుస్తకాలను రాజ అమర్ సింగ్ వద్ద నుండి గత 50 ఏళ్ల లో సేకరించారు.



Click it and Unblock the Notifications