లక్ష్మీ దేవికి అంకితమివ్వబడిన ఆలయం మహా లక్ష్మీ టెంపుల్. లక్ష్మీ తాల్ కి సమీపం లో ఉన్న లక్ష్మీ దర్వాజా కి వెలుపల నెలకొని ఉన్న ఈ ఆలయం 18 వ శతాబ్దం లో నవల్కర్ కి చెందినా రెండవ రఘునాథ్ రావు చేత నిర్మించబడింది. 1769 లో సుబేదార్ విశ్వాస్ రావు లక్ష్మణ్ మరణం తరువాత ఝాన్సీ కి సుబేదార్ గా ఈయన నియమితులయ్యారు. ఝాన్సీ యొక్క హిందూ పాలకులు మరియు సామాన్య ప్రజలు మహా లక్ష్మీ దేవికి పరమ భక్తులు.
ఈ ఆలయం యొక్క పేరుకు రాణీ లక్ష్మీ బాయి కి ఎటువంటి సంబంధం లేదు. రాజా గంగాధర్ రావు ని లక్ష్మీ బాయి వివాహం చేసుకోవడానికి ముందే ఈ ఆలయం నిర్మించబడింది. అద్భుతం గా చెక్కబడిన ఈ ప్రాచీన ఆలయం అనేకమైన చారిత్రక విషయాలకి సాక్ష్యం గా నిలుస్తుంది. ఈ ప్రాంతం ఏడాది పొడవునా భక్తులతో పాటు పర్యాటకులు, చరిత్ర కారుల వంటి వారిని కూడా అమితం గా ఆకట్టుకుంటుంది. అధిక మంది భక్తజనం తో ఈ ప్రాంతం పర్వదినాలలో రద్దీగా ఉంటుంది. ప్రత్యేకించి దీపావళి రోజున లక్ష్మీ పూజ జరిగే రోజున భారీ సంఖ్యలో భక్త జనం ఇక్కడ సందడి చేస్తారు.



Click it and Unblock the Notifications