రామక్రిష్ణ ఆశ్రమం, రామక్రిష్ణ మఠం, బేలూరు మఠం వారి ఉప శాఖ. ఇది ఆది శంకరులవారి జన్మస్ధలంలో కలదు. దీనిలో ఒక పెద్ద హాలు ప్రార్ధనలకు కలదు. బేలూరు రామక్రిష్ణ దేవాలయం నమూనాలో ఒక గుడి కలదు. ఆశ్రమం ఒక స్కూలును, ఒక ఛారిటబుల్ ట్రస్టు మరియు ఒక లైబ్రరీని నిర్వహిస్తోంది. స్కూలును బ్రహ్మానందోయం అంటారు.
రామక్రిష్ణ ఆశ్రమం పరిసరాలు ఎంతో సహజంగా ఉంటాయి. ఇక్కడ మీరు ప్రార్ధన చేసుకోవచ్చు. సమీప ప్రాంతాలలో విశ్రాంతి నడకలు చేయవచ్చు. చక్కని విశ్రాంతి పొందవచ్చు. ఆశ్రమ వాతావారణంలో మీకు గల బాధలన్ని మరచిపోతారు.



Click it and Unblock the Notifications