ద్వారకాదీష్ అంటే శ్రీ కృష్ణుడు. ద్వారకకు పాలకుడు అని అర్ధం. ఈ టెంపుల్ కాన్పూర్ లో కమల టవర్ సమీపంలో కలదు. హిందూ కేలండర్ మేరకు శ్రావణ మాసపండుగ జూలై లేదా ఆగష్టు నెలల లో పడుతుంది. ఉత్తర భారత దేశం లోని హిందువులు ఈ కాలాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు.
శ్రీకృష్ణుడు రాధల సమక్షంలో పండుగలు జరుపుకోవటం కన్నా మరొక ఉత్తమ మార్గం లేదని భావిస్తారు. వీరు రాదా కృష్ణుల విగ్రహాలను రంగు రంగు ల గుడ్డలతో అలంకరించి వాటిని ఊయలలో కూర్చో పెట్టి ఎంతో భక్తి తో ఊపుతారు. ఆనందోత్సాహాలతో పాటలు, భజనలు పాడతారు. కాన్పూర్ లోని ద్వారకదీష్ టెంపుల్ అక్కడ కల ఊయలకు ప్రసిద్ధి. భక్తులు మైమరచి రాధాకృష్ణుల విగ్రహాలను ఊయలలో పెట్టి ఊపుతూ ఆనందిస్తారు.



Click it and Unblock the Notifications