ఫూల్ బాగ్ ని గణేష్ విద్యార్ధి ఉద్యాన్ అని కూడా అంటారు. ఇది సిటీకి మధ్యలో కాన్పూర్ సెంట్రల్ రైల్వే స్టేషన్ , ఎల్ ఐ సి బిల్డింగ్ మరియు నానా రావు పార్క్ సమీపం లో కలదు. ఈ పార్క్ ను క్వీన్ విక్టోరియా గార్డెన్ అని బ్రిటిష్ పాలిత ఇండియాలో అనే వారు. ఈ గార్డెన్ లో అనేక ప్రసిద్ధ వ్యక్తులు అంటే, మహాత్మా గాంధి, ఇందిరా గాంధీ, అటల్ బిహారీ వాజ్ పాయీ, రాం మనోహర్ లోహియ వంటి వారు తమ ఉపన్యాసాలను వినిపించేవారు.
ఫూల్ బాగ్ లో కాన్పూర్ సంగ్రహాలయ మరియు కాన్పూర్ యూనియన్ క్లబ్ కూడా వుంటాయి. ఇటీవలి వరకూ ఈ ప్రదేశాన్ని బాగా నిర్వహించగా, ఇపుడు ఇది రాజకీయ బహిరంగ సభలకు నిలయమై, పచ్చదనాన్ని కోల్పోయింది. పూర్వ వైభవం కోల్పోయింది.



Click it and Unblock the Notifications