జంగలా జన్స్కార్ తాలూకా లో పాడుం టవున్ కు సుమారు 35 కి.మీ.ల దూరం లో గల ఒక చిన్న పట్టణం. శీతాకాలం లో జన్స్కార్ నది పడుం నుండి జంగలా మార్గంలో పూర్తిగా గడ్డ కడుతుంది. అపుడు ఏర్పడే మంచుగడ్డపై నడక సాగించవచ్చు. దీనిని స్థానిక భాషలో చాదార్ అంటారు. ఈ మార్గంలో కల చిన్న గుహలు పర్యాటకులకు రాత్రులలో వసతిగా పని చేస్తాయి. జంగలా ప్రదేశం, ట్రెక్కర్ లకు ఒక బేస్ క్యాంపు గా వుంటుంది.



Click it and Unblock the Notifications