పేధ్ కోటను కోట్లిగడ్ అని కూడా పిలుస్తారు. పేధ్ గ్రామం కర్జాత్ కు సమీపంలో ఉండి పర్యాటకులకు ప్రధాన ఆకర్షణగా ఉంటుంది. పేధ్ కొండలు వెనుక భాగంలో మాధేరన్ ప్రదేశ అందాలతో మరింత మనోహరంగా చూడబడతాయి. ఇక్కడనుండి కొంకణ్ గ్రామీణ ప్రాంత అందాలు చూడబడతాయి. కోటకు సమీపంలోనే పవిత్ర లార్డ్ భైరోబా విగ్రహం ఉంది. పేధ్ కోట ప్రస్తుతం శిధిలావస్ధలో కలదు.
అయినప్పటికి ఇక్కడి స్నానపు తొట్టెలు, గదులు అన్ని ఆకర్షణీయంగా కనపడతాయి. ఈ కోటను బలవంతులైన మరాఠా యోధులు శత్రువులనుండి రక్షించుకునేటందుకు నిర్మించారు. ఇదే ప్రాంతంలో నెధర్ సోల్ డ్యామ్ మరియు ఫన్సాడ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీలు కూడా యాత్రికులు అధికంగా సందర్శించే ప్రదేశాలు.



Click it and Unblock the Notifications