ప్రకృతిసౌందర్య ప్రేమికులు తప్పనిసరిగా చూడవలసిన ప్రాంతం భుషి సరస్సు. ఖండాలాలోని ఈ సరస్సు ఒడ్డున బద్ధకంగా అనిపించే మధ్యాహ్నాల బడలిక తగ్గించుకోవచ్చు. దీని నిర్మలమైన ప్రశాంత పరిసరాలు, స్వచ్చమైన నీరు పర్యాటకుల విశ్రాంతికి అనువైన అనేక అవకాశాలను కల్గిస్తాయి ఖండాలా పరిసరాలలో అనేక ఇతర సరస్సులు ఉన్నాయి.
ఉపశమనం కల్గించే చిరస్మరణీయ అనుభవం కొరకు తుగాలి లేక్, లోనవాల లేక్, వాల్వన్ డాం లను తప్పకుండ చూడండి. కునే ఫాల్స్ ఖండాలా లోని కునే ఫాల్స్ ఒక ప్రధాన ఆకర్షణ. 100 కిలోమీటర్ల ఎత్తు నుండి పడే గంభీరమైన కునే జలపాతం చూడడం ఏ ఒక్కరు మర్చిపోకూడదు. లోనవల ఖండాలా మధ్యలో గల ఈ జలపాతంలో పర్యాటకులను జలకాలాటలకు అనుమతిస్తారు.రివర్సింగ్ స్టేషన్ రివర్సింగ్ స్టేషన్ ఖండాలా లోని ఒక అద్భుతమైన ప్రాంతం.
26వ నెంబర్ టన్నెల్ వద్దగల ఈ పురాతన ప్రాంతం రైల్వేకు చెందినా ప్రస్తుతం ఉపయోగంలో లేదు. రాత్రి పూట ఈ ప్రాంతం అనేక వందల లైట్లు వెలగడం వల్ల ప్రకాశవంతంగా దివ్యంగా కనబడుతుందిమంకి హిల్ ఖండాలా లోని మంకి హిల్ స్థానిక పర్యాటకులకు అభిమాన యాత్ర స్థలము. ఖపోలి పట్టణానికి పైన రైల్వే ట్రాక్స్ కు ఉత్తరాన గల పెద్ద చదునైన ఈ ప్రాంతానికి ఖోపోలి నుండి లేదా బోర్ఘాట్ రివర్సింగ్ స్టేషన్ నుండి గాని చేరవచ్చు. పర్వతారోహణ రాళ్ళను ఎక్కే సాహాసాన్ని చేయదలుచుకుంటే మీరు ఖండాలా లో ఈ ప్రయత్నాన్ని చేయవచ్చు. డ్యూక్స్ నోస్ పీక్, కర్ల కొండలు ఎక్కి డ్యూక్ నోస్ పై నుండి విశాలమైన గ్రామ ప్రాంతాలకు చెందిన మైమరపించే అందాలను చూడవచ్చు.



Click it and Unblock the Notifications