కొహిమ మ్యూజియంలో నాగ ల్యాండ్ సంస్కృతి , చరిత్ర లను గురించిన పూర్తి వివరాలు తెలుస్తాయి. ఈ మ్యూజియం టవున్ కు ఒకటిన్నర కి.మీ.ల దూరంలో వుంటుంది. బయావు హిల్ పై ఈ మ్యూజియాన్ని1970 లో నాగా ల్యాండ్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. నాగాల కళలు, కళా కృతులు, పురాతన ఆయుధాలు, రంగు రంగుల సాంప్రదాయ దుస్తులు, వారి ఆహారం మొదలైన అంశాల గురించి తెలియ చేస్తుంది.
విలువైన జాతి రత్నాలు, సముద్రపు పగడాలు, కంచు, వెండి గంటలు , నాగా ల వేడుకల దుస్తులు , వారి సంగీత పరికరాలు మొదలైనవి ప్రదర్శించ బడతాయి. వీరిసాంప్రదాయ నివాసాలు, గుడిసెలు ఇక్కడ ఒక ప్రత్యేకత.



Click it and Unblock the Notifications