కోలార్ జిల్లాలో సోమేశ్వర దేవాలయాన్ని తప్పక చూడదగ్గ వాటిలో ఒకటిగా పరిగణిస్తారు. ఇక్కడ ఉన్న సోమేశ్వరుడిని శివుని యొక్క అవతారాలలో ఒకటిగా భావిస్తారు, ఈ ఆలయం కోలార్ పట్టణానికి మధ్యలో ఉంది. ఈ యాత్రాస్థలం విజయనగర నిర్మాణ శైలితో 14 వ శతాబ్దంలో నిర్మించబడింది.
ఈ స్థలం లోపల ఒక కళ్యాణ మండపం ఉంది, దాని స్తంభాలు ఎంతో క్లిష్టమైన చేక్కుడుతో చాల అందంగా ఉంటాయి. ఈ స్తంభాలపై కనిపించే చెక్కుడు చైనీస్, యురోపియన్, థాయి నిర్మాణ శైలిని ప్రతిబింబిస్తాయి. కళ్యాణ మండపం పైభాగం చైనీస్ శైలిలో రూపకల్పన చేయబడింది. సోమేశ్వర దేవాలయం వద్ద భారతదేశ, విదేశీ భూముల నిర్మాణ శైలుల సమ్మేళనం వలన విజయనగర సామ్రాజ్య సమయంలో వ్యాపారానికి వున్న ప్రాముఖ్యతని తెలియచేస్తుంది.



Click it and Unblock the Notifications