కొల్లాం కేంద్రానికి కి 10 కి.మి. దూరం లో ఉన్న ఈ గుడి అద్భుతమైన నిర్మాణం, మంత్రముగ్ధుల్ని చేసే శిల్పాలతో వందలాది మంది సందర్శకుల్ని ఆకర్షిస్తోంది. భవనం యొక్క మొత్తం నిర్మాణం పాండ్యన్ నిర్మాణ పద్ధతులను ఉపయోగించి రూపొందించబడింది. అందుకే దానికి ఆ విలక్షణత. ఆలయ ముఖ్య ఆకర్షణ పౌరాణిక రాక్షసుడు వ్యాల యొక్క పెద్ద పెద్ద శిల్పాలు. ఈ పెద్ద పెద్ద శిల్పాలు గుడికి ఒక ప్రాచీనత్వాన్ని ఇస్తున్నాయి.
ప్రాచీన తమిళ శాసనాలు గల ఈ గుడి పురావస్తు శాస్తవేత్తలకి, చరిత్రకారులకి ఎంతో ఆసక్తిని కలిగించింది. ఈ శాసనాలు 16 వ శతాబ్దం నాటివి గా భావిస్తున్నారు. కొల్లాం-అయుర్ రోడ్డు మీద గల ఈ ఆలయ పరిసర ప్రాంతాల్లోని గాలిలో నిర్మలత్వం, దైవత్వం సందర్శకులకి చక్కటి రిలీఫ్ ని ఇస్తుంది.



Click it and Unblock the Notifications