కొల్లాం కి 6 కి.మి. దూరం లో వాణిజ్య కార్యకలాపాల గోల ఏమీ లేకుండా ప్రశాంతంగా అందమైన ఇసుక తీరాలతో కూడిన తిరుముల్లవరం బీచ్ లో నీళ్ళు అంత లోతు గా లేకపోవడం వల్ల ఇది ఈదటానికీ, కుటుంబ విహార యాత్రలకి, బాగా అనువైన ప్రదేశం. ప్రత్యేకించి చిన్న పిల్లలు ఇక్కడ బాగా ఎంజాయ్ చేస్తారు.
సందర్శకులు కూడా ఈ ప్రాంతం లో పరిసరాలని వీక్షిస్తూ చక్కగా ఆనందిస్తారు. ఇతరప్రాంతాలకి దూరంగా ఉన్న ఈ బీచ్ నగరాల్లోని గందరగోళం, రోజువారీ అలసటకి దూరంగా వెళ్ళాలనుకునేవాళ్ళకి సరైన ప్రదేశం. ఈ బీచ్ కి దగ్గర్లోని విష్ణువు గుడి కారణంగా దీనికి ఈ పేరు వచ్చింది. న్యారళ్చ పార అనే ఒక ప్రసిద్ద రాయి ఇక్కడ ఉంది.
తీరానికి అర కి.మి. దూరం లో సముద్ర మధ్యలో ఈ రాయి ఉంది. ఆటు సమయంలో నీరు వెనక్కి వెళ్తున్నపుడు ఇది కనిపిస్తుంది. వర్షా కాలం తప్ప ఏ కాలం లోనైనా సందర్శించదగ్గ ఈ బీచ్ కి సాయంత్ర సమయం లో వెళ్తే బీచ్ అందాల్ని బాగా ఎంజాయ్ చేయొచ్చు.



Click it and Unblock the Notifications