కోణార్క్ కి సమీపం లో ఉన్న ఫిషింగ్ కేంద్రం అష్టరంగ. ఈ ప్రాంతం దేవి నది ఒడ్డున ఉన్నది. కోణార్క్ నుండి 19 కిలోమీటర్ల దూరం లో ఉంది. ఒరియా భాషలో అష్ట అంటే సూర్యోదయం రంగ అంటే రంగు.
సూర్యోదయ సమయం లో రంగులమయం గా కనిపించే ఈ ప్రాంతానికి ఈ పేరు సరిగ్గా సరిపోతుంది. ప్రపంచం నలుమూలల నుండి ఈ ప్రాంతం పర్యాటకులను అందుకే ఆకర్షిస్తుంది. అష్టరంగ బీచ్ పర్యాటకులకి అమితమైన ఆనందాన్నికలిగిస్తుంది.
ఉప్పు ఉత్పత్తి కి అలాగే ఫిషింగ్ కి ఈ ప్రాంతం ప్రసిద్ది చెందింది. ఈ బీచ్ లో ఉన్న చిన్న ఫిష్ మార్కెట్ లో జాలరి వాళ్ళు రక రకాల చేపలని ఆసక్తి కనబరచిన కొనుగోలుదారులకి అమ్ముతారు. అష్టరంగ లో ని ఉదయం పూట జాలరివాళ్ళు చేపల వేట నుండి వచ్చే సమయానికి కొనుగోలుదారులు తాజా చేపలు కొనడానికి ఎదురుచుస్తారు.



Click it and Unblock the Notifications