సమకాలీన ఇంజనీరింగ్ అధ్భుత౦గా పరిగణించబడే కోట బ్యారేజ్ ఈ నగరపు అనేక అవసరాలను తీరుస్తుంది. రాజస్థాన్, మధ్య ప్రదేశ్ లోని రైతులకు ఇది ప్రధాన జల వనరు. పైగా ఈ బ్యారేజ్ విద్యుదుత్పత్తి సామర్ధ్యానికి ప్రసిద్ది చెందినది. 1960లో చంబల్ లోయ ప్రాజెక్ట్ లో నిర్మించిన డ్యాం లలో ఇది నాల్గవది. ఈ ఆనకట్ట 99 క్యూబిక్ మిల్లి మీటర్ల నిల్వ సామర్ధ్యాన్ని, 27,332చదరపు కిలోమీటర్ల పరివాహక ప్రాంతాన్ని కల్గి ఉంది.