కొట్టరక్కర శ్రీ మహాగణపతి దేవాలయం, కొట్టరక్కరలో ప్రధాన ఆకర్షణలలో ఒకటి. చాలామంది ప్రజలు దీనిని దర్శిస్తారు. ఇది కొల్లం జిల్లా మధ్య భాగం నుండి సుమారు 25 కి.మీ.ల దూరంలో కలదు. రోడ్డు మార్గంలో తేలికగా చేరవచ్చు. దేవాలయాన్ని మొదటగా కిజక్కేకర శివ దేవాలయం అని పిలిచేవారు. దీనిలో శివ భగవానుడు ప్రధాన దైవం. అయితే, కాలక్రమేణా అక్కడ ఉప దేవతగా ప్రతిష్టించబడిన వినాయకుడితో ఇది గణపతి దేవాలయంగా ప్రసిద్ధి కెక్కింది. వినాయక చతుర్ధి, నవరాత్రి, అయిల్యామ్ మాకం మొదలైన పండుగలు చేస్తారు. వీటికి ప్రతి సంవత్సరం దక్షిణ భారత దేశం నుండే వేలాది భక్తులు వస్తారు. దేవాలయంలో శివుడు, పార్వతి, మురుగన్ మరియు అయ్యప్పల విగ్రహాలు కలవు. ఈ దేవాలయంలో అన్ని కులాల వారికి, అన్ని మతాల వారికి ప్రవేశ అనుమతి లభిస్తుంది. కొట్టరక్కర శ్రీ మహాగణపతి దేవాలయం లో ఇచ్చే ఉన్ని అప్పం ప్రసాదం కేరళ రాష్ట్రమంతా ప్రసిద్ధి చెందింది.



Click it and Unblock the Notifications