కాలికట్ నగరం నుండి 43 కిమీ దూరంలో ఉన్న పెరువన్నముళి ఆనకట్ట ఉంది. పెరువన్నముళి అందమైన గ్రామం, ఈ గ్రామానికి ఎక్కవుగా బస్సులు ఉంటాయి. కాలికట్ నగరం నుండి పెరువన్నముళి ఆనకట్ట చేరటానికి బస్సు ద్వారా 2 గంటల ప్రయాణం పడుతుంది.పర్యాటకులు వందల సంఖ్యలో వస్తారు.ఆనకట్ట చుట్టుపక్కల చూడవలసిన ప్రదేశాలు చాలా ఉన్నాయి.పర్యాటకులకు బోటింగ్ సౌకర్యం కూడా ఉంది.ఇక్కడ కృత్రిమ సరస్సు ,స్మారక తొట్టం,స్వతంత్ర సమరయోధులు గౌరవార్థంగా ఏర్పాటుచేసిన తోట,మొసలి ఫార్మ్ మరియు పక్షి అభయారణ్యం సందర్శించటానికి దగ్గరలో ఉన్నాయి.
90 రకాల పక్షుల జాతులు ఉన్నాయి.పెరువన్నముళి ప్రాంతంలో మలబార్ వన్యప్రాణుల అభయారణ్యభాగం ఉంది.అది జంతువుల మరియు వృక్షాలతో సందర్శకులను అలరిస్తుంది.ఈ ప్రదేశంలో సుగంధ ద్రవ్యాలు మరియు భారత స్పైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఉన్నాయి.రిజర్వాయర్ ఆదివారాలు మరియు జాతీయ సెలవులు మినహా అన్ని రోజుల్లో సాయంత్రం 6 PM వరకు తెరచి ఉంటుంది. వేసవిలో ఈ స్థలం సందర్శించచటానికి వీలుగా ఉంటుంది.వాన కాలం సందర్శనకు వీలు కాదు.