కుమరకొం లో ఉన్న జమ్మా మసీద్, తజతంగడి మాస్క్ గా ప్రసిద్ది చెందింది. కుమరకొం పట్టణం నుండి 12 కి మీ ల దూరంలో ఉన్న ఈ మసీద్, ప్రఖ్యాతమైన మసీద్. మీనచిల్ (Meenachil) నది ఒడ్డున ఉన్న ఈ మసీద్ కి తరచూ ఎంతో మంది భక్తులూ మరియు పర్యాటకులు వస్తూ ఉంటారు. ఈ మసీద్ కి వెయ్యేళ్ళ చరిత్ర ఉంది. దేశంలోనే అతి పురాతనమైనది గా దీనిని భావిస్తారు. సాంప్రదాయక నిర్మాణ శైలితో ఈ మసీద్ ఒక ప్రత్యేకతను పొందింది. ప్రాచీనా కాల సంస్కృతీ వైభవానికి ఈ మసీదుపై అందంగా చెక్కబడిన అక్షరాలూ ఖచ్చితంగా సాక్ష్యంగా నిలుస్తాయి అనడంలో అతిశయోక్తి లేదు. ఈ మసీదు లో ఒక ప్రాంగణం(నలుకెట్టు అని అంటారు) మరియు స్నానం చేసే ప్రదేశం ఉన్నాయి. హబీబ్ దీనార్ గారిచే ఈ చర్చ్ నిర్మించబడినదని, వారి కుమారుడు మాలిక్ దీనార్ ఇస్లాం మతాన్ని కేరళకి తీసుకువచ్చారని నమ్మకం. సంరక్షించవలసిన మాన్యుమెంట్ గా ఈ మసీదు ని ప్రభుత్వం గారు గుర్తించారు.



Click it and Unblock the Notifications