మెడిటేషన్ పార్క్ ను జపనీస్ మెడిటేషన్ పార్క్ అని కూడా పిలుస్తారు. దీనిని ఇండో జపనీస్ ప్రాజెక్టులో భాగంగా అరవై ఎనిమిది లక్షల రూపాయలు ఖర్చుతో 1992-1993 లో నిర్మించారు. పేరుకు తగ్గట్టుగా ఈ ఉద్యానవనం ప్రజలు ధ్యానం మరియు విశ్రాంతి తీసుకోవటానికి ఏర్పాటు చేశారు. ఇది నిర్మలమైన మరియు సహజ పరిసరాలన మధ్య, కృత్రిమ నీటి వనరులు, పెరుగుతున్న పచ్చని గడ్డితో వేదికల మధ్యన ఉన్నది. ఈ ఉద్యానవనంలో సాల్ చెట్టు మరియు అనేక ఇతర ఆకుపచ్చచెట్లకు ఇరుపక్కల పూల మొక్కలు చూడవచ్చు.
నిర్వాణ స్థితిలో ఉన్న బుద్ధుడి విగ్రహం ఉన్న ప్రముఖ నిర్వాణ దేవాలయానికి సమీపంలో ఇది ఉన్నది. నిర్వాణ ఆలయం సమీపంలో ఉన్న కారణంగా ఇక్కడ ఆధ్యాత్మిక వాతావరణం ఉన్నది మరియు ఇక్కడ ధ్యానం చేసుకోవటానికి అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ఇది నగరంలో అత్యంత అందమైన మరియు శాంతమైన ప్రదేశం మరియు ఇక్కడికి సంవత్సరం పొడవునా సందర్శకులు పెద్ద సంఖ్యలో వొస్తారు.



Click it and Unblock the Notifications