మనాలి లో ఉన్న ముఖ్యమైన ఆధ్యాత్మిక కేంద్రాలలో హడింబ టెంపుల్ ఒకటి. హిందూ పురాణాల లో రాక్షసి అయిన హడింబి చెల్లెలు హడింబా దేవికి ఈ కేవ్ టెంపుల్ అంకితమివ్వబడింది. దేవదారు వృక్షాల అడవిలో ఉన్న ఈ దేవాలయం హిమాలయాల పాదప్రాంతం లో ఉంది. 1553 కి చెందిన ఈ దేవాలయం భూమి నుండి ఉద్భవించిన ఒక పెద్ద రాతి నుండి నిర్మించబడింది. ఈ ఆలయం లోపల ఉన్న ఈ రాతి ని దేవత కి ప్రతిరూపంగా భక్తులు కొలుస్తారు.
స్థానిక పురాణాల ప్రకారం, ఇటువంటి ఆలయ నిర్మాణం వేరే ఎక్కడా కనపడకూడదని ఈ ఆలయ నిర్మాణానికి కారకుడైన రాజు ఈ ఆలయ నిర్మాణంలో పాల్గొన్న కళాకారుల కుడి చేతిని నరికించి వేసాడు.
ఉత్సవ గుర్రం తో నిర్వహించే "ఘోర్ పూజ" అనే వేడుకలో భాగంగా దేవత యొక్క ఆశిస్సులు భక్తులు పొందుతారు. మే 14 నాడు ఇక్కడ కొలువున్న దేవత యొక్క జన్మదిన వేడుకలకి అధిక సంఖ్యలో హాజరవుతారు.



Click it and Unblock the Notifications