మంగళా దేవి దేవాలయం బొలారా అనే ప్రదేశంలో ఉంది. ఇది మంగుళూరు నగరానికి నైరుతి దిశగా 3 కి.మీ. దూరంలో ఉంది. దేవాలయం చుట్టూ చాలా కోటలు ఉన్నాయి. అందుకనే దీనిని మంగళా దేవి నగరం అని అర్ధం వచ్చే రీతిలో మంగళ ఊరు అని పిలువబడింది. ఈ దేవాలయం 9వ శతాబ్దంలో తమిళనాడును పాలించిన రాజు కుందవర్మచే కనుగొనబడింది. మందిరంలో ప్రధాన దేవత మంగళా దేవి. నవరాత్రి సమయంలో ప్రత్యేక పూజలు ఉంటాయి. నవరాత్రి తొమ్మిదవ రోజున ఒక పెద్ద ఊరేగింపు చేస్తారు. దీనిని రధోత్సవం అంటారు.ఈ సమయంలో దేవిని రధంపై ఊరేగిస్తారు. మంగళా దేవిని పూజిస్తే ఎంతో మంచి జరుగుతుందని ప్రజలు భావిస్తారు. ఈ దేవాలయంలో గణేష ఉత్సవాలు కూడా ఘనంగా చేస్తారు. మంగుళూరు నుండి బస్ లో ఈ మందిరానికిచేరవచ్చు. ఈ దేవాలయంలో కన్నె పడుచులు మంగళ పార్వతి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ వ్రతం చేసిన కన్నె పిల్లలకు మంచి భర్త లభించి జీవనం ఆనందంగా ఉంటుందని ప్రతీతి.



Click it and Unblock the Notifications