మంగుళూరుకు 30 కి.మీ. దూరంలో ముల్కి వద్ద స్ధాపించిన దేశపు మొదటి సర్ఫింగ్ క్లబ్ ఇది. ఈ క్లబ్ మన దేశానికి అంతర్జాతీయంగా పేరు తెచ్చిపెట్టింది. దీనిని జాక్ హెబనర్ మరియు రిక్ పెర్రీలు 2006లో స్ధాపించారు. వీరు అమెరికాలోని సర్ఫింగ్ నిపుణులు. సాధారణంగా సర్ఫింగ్ అనేది ఒక మంచి కాలక్షేపం మరియు ఆరోగ్యాన్ని, ఆధ్యాత్మికతలను ఇస్తుంది. మంత్ర సర్ఫింగ్ క్లబ్ ఒక ఆశ్రమంగానూ ఉంటుంది. ప్రతిరోజూ సర్ఫింగ్ కార్యక్రమాలలో ధ్యానం, జపమాలతో మంత్రాలు పఠించటం ఉంటాయి. ఇవి ఈ సర్ఫింగ్ క్లబ్ ప్రత్యేకతలుగా చెప్పబడతాయి. ఈ క్లబ్ ప్రధాన ఉద్దేశం ఆధ్యాత్మిక ఆరోగ్యం పెంచటం. వీరు సంవత్సరంలో కొన్ని పండుగలు కూడా చేస్తారు. ఆధ్యాత్మిక సందేశాలు, ప్రసంగాలు చేస్తారు. ఇది స్ధాపించి షుమారు 15 సంవత్సరాలైంది. అయితే, ఇప్పటికి 15 మంది సర్ఫింగ్ సభ్యులు మాత్రమే ఉన్నారు. అందుకనే వీరికి దేశంలో అన్ని ప్రాంతాలలో ఎంతో పేరు ప్రతిష్టలున్నాయి.



Click it and Unblock the Notifications