ఎస్సెల్ వరల్డ్ ఆసియాలోనే అతిపెద్ద ఎమ్యూజిమెంట్ పార్క్. దీనిని డిస్నీ లాండ్ మోడల్ లో నిర్మించారు. ముంబైలోని ఎస్సెల్ వరల్డ్ కు వెళ్ళారంటే ఇక ఆరోజంతా మీకు ఆనందమే. అయితే, ఈ ప్రదేశం సాహస క్రీడలు చేయాలనేవారికి పనికి రాదు. పార్క్ నిర్వహణ అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా కలద. పర్యాటకులు ఈ ప్రదేశం బాగా ఇష్టపడతారు.
వాటర్ కింగ్ డం అనేది ఒక ధీమ్ పార్క్ ఇది ఎస్సెల్ వరల్డ్ పక్కనే కలదు. పర్యాటకులు రెంటికి కలిపి డే పాస్ తీసుకొని ఆనందించవచ్చు. నీటి ప్రియులు వాటర్ కింగ్ డం ఇష్టపడతారుఏర్పాట్లు ఎంతో ఆధునికంగా ఉండి నీటి క్రీడలు మీకు వినోదం కలిగిస్తాయి. ఈ ప్రదేశాలకు వెళ్ళాలంటే గోరై నుండి ఫెర్రీ బోట్ లో వెళ్ళవచ్చు. లేదా రోడ్డు ప్రయాణంలో కూడా వెళ్ళవచ్చు.



Click it and Unblock the Notifications