ఎకో పాయింట్, మున్నార్

ఎకో పాయింట్ మున్నార్ పట్టణానికి 13 కి.మీ.ల దూరంలో కలదు. యువకులకు ఇది ఆసక్తికర ప్రదేశం. చాలా హిల్ స్టేషన్లకు ఎకో పాయింట్లు ఉంటాయి. అయితే, మున్నార్ లోని ఎకో పాయింట్ సుందరమైన నది ఒడ్డున కలదు. ఈ ఎకో పాయింట్ నుండి పర్యాటకులు తమ స్వర ధ్వనులను ప్రతి తరంగాలుగా అక్కడి రిజర్వాయర్ నీటినుండి వినగలరు. మంచు అనుభూతి ప్రాంతాలు, మెత్తని నదీతీర ఒంపులు, ఎకో పాయింట్ ను ఒక పిక్ నిక్ స్పాట్ గా చేశాయి. సరస్సు ఒడ్డు చక్కటి షికార్లకు, విశ్రాంతి నడకలకు అనుకూలం. చుట్టూ కల తేయాకు తోటలు, సుగంధ ద్రవ్యాల తోటలు, ట్రెక్కర్లను ప్రకృతి అన్వేషణకు ఆహ్వానిస్తూంటాయి. పచ్చటి ప్రదేశాలు మరియు వివిధ ఇతర ఆకర్షణలతో ఎకో పాయింట్ ఒక సాహస క్రీడాకారుల స్ధలంగా ఉంది. ఫొటో గ్రాఫర్లు, ఈ ప్రదేశాన్ని తనివి తీరా తమ ఫొటోల చాతుర్యంతో తీసి ఆస్వాదిస్తారు.

Please Wait while comments are loading...