మీనులి మున్నార్ హిల్ స్టేషన్ సమీపంలోని ప్రసిద్ధ పర్యాటక స్ధలం. ట్రెక్కింగ్ మరియు మౌంటెనీరింగ్ లకు ప్రసిద్ధి. ప్రకృతి ఇక్కడ ఎన్నో అందమైన రూపాలలో దర్శనమిస్తుంది. మీనులిలో రెండు ప్రధాన ఆకర్షణలు కలవు. వాటిలో ఒకటి అతిపెద్ద రాయి కాగా మరొకటి ఎప్పుడూ పచ్చగా ఉండే అడవి. మీనులి లో అతి సాధారణమైన పెద్ద రాయిని సుమారు 500 ఎకరాల విస్తీర్ణం వ్యాపించిన దానిని చూస్తారు. ఇక్కడనుండి దిగువ పెరియార్ నది మరియు భూతతంకెట్టు చూడవచ్చు. రాయి పై భాగంలో ఎల్లపుడూ పచ్చగా ఉండే రెండు ఎకరాల అడవిని చూడవచ్చు. రాయి పై భాగంలో కల ఈ పచ్చటి అడవి ఒక ప్రకృతి అందించే అద్భుతం. ట్రెక్కింగ్ మరియు రాక్ క్లైంబింగ్ చేసే వారికి మీనులి ఆసక్తి కల ప్రదేశం. ఈ ప్రదేశానికి వెళ్ళే వారు తమ ఆహారం, నీరు తప్పక తీసుకు వెళ్ళాలని సూచించవచ్చు.